అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు

అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ డి.జానకి  

 మహబూబ్ నగర్   జులై 1(లోకల్ గైడ్):

పాలమూరు  జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతతను పెంపొందించేందుకు జూలై 1 నుండి 31 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉన్నాయని  జిల్లా ఎస్పీ డి.జానకి, మంగళవారం మీడియాకు  తెలిపారు.ఈ 30 పోలీస్ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట,  ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధము. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన  30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి  తెలిపారు

Tags:

About The Author

Latest News