అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి      .

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి      .

సాయం లేకున్నా
సాగుచేస్తున్న రైతన్నకు 
సమస్యలే ఆసులైనాయి 
మార్కెట్లో మోసాలే
సంపద అయింది
అన్నదాతకు ఆకలి
మిగిలింది ఆత్మహత్యే  
‌శరణ్యం అయ్యాయి

భూమిని నమ్మినాటు వేసి
కొత కోసి పంట పండించిన
ఆరుగాలం  నీ శ్రమకు 
ప్రతిఫలం లేక   దిక్కులను
చూస్తూ దిగులు నీపాలిట 
గుదిబండ అయ్యేనా 

పరుల కొరకు పాటు పడే 
రైతన్న నకిలీ విత్తనాలు
కల్తీ ఎరువుల కాఠిన్యతకు
పురుగుమందుల
విషకౌగిట్లో చిక్కుకొని 
విలవిలలాడే
రైతన్న  భలిపశువు 
అయిపోయి 
కుటుంబం కుదేలైంది 

ప్రకృతి విపత్తుల దాటికి
పంట పోయి ప్రాణాలు 
పోయి బావురు మంటూ  
రైతు కుటుంబాలు వీధి 
పాలై బతుకుకు భద్రతలేక
చావుకు భీమా రాక
సమస్యల సుడిగుండంలో
జీవితం గడుపుతున్నాడు 

రైతన్నపంటకు 
గిట్టుబాటు దర లేక 
దిక్కులేని అనాదైనాడు

దుక్కి దున్ని, నాట్లు వేసి
కోతకోసి, కుప్పనూర్చి
మార్కెట్లో మరణ శయ్యపై 
ప్రాణాలు వదులుతున్న  
పట్టించుకునే‌ వారు లేక 
అధికారుల నిరాదరణ 
పాలకుల రాజకీయ
క్రీడలో  బలవంతపు
చావే (నీ) రైతుల రేవాయే

వ్యవసాయం వదిలి  
బతుకుకై పట్టణ బాట 
పట్టిన నీకు అడుగడుగున 
మోసాలే పలకరించె
(దర్షన మిచ్చే )  
ఆత్మహత్యలే నీఆస్తి ఆయే 

కార్పోరేట్ మార్కెట్ 
కార్పొరేట్ వ్యవసాయం
మయాజాలానికి 
కల్తి ఎరువులు విత్తనాలు 
రాజ్యమేలి నీబతుకు చిధ్రం
చేసి ఉరికొయ్యలు అప్పులే
నీ  ఆస్తులయ్యే

అమ్మబోతే అడవి
కొనబోతే కొరివిలా 
తయారైన పాలకుల 
ప్రవర్తన నీకు నిరాశ 
నిస్పృహ లనే 
కానుకగా ఇచ్చే   
స్థితి మారాలి 

నీ పంటకు నీవే దర 
నిర్ణయించుకోవాలి
ఆపద అమ్మకాలు 
అంతం కావాలి

థళారీ వ్యవస్థ 
రద్దు కావాలి 
రైతాంగ శ్రేయస్సే
కేంద్రంగావ్యవసాయ
విధానం ఉండాలి

వ్యవసాయ రంగం 
యువతను ఆకర్షించే 
విధంగా విధి విధానాలు 
రూపొందించాలి

ఆధునిక వ్యవసాయం
అభివృద్ధికి ఊతం
ఇవ్వాలి నేల తీరును
బట్టి పంటలు 
సేంద్రియ సాగుతో 
మేలు రకం 
పంటలతో ప్రగతిశీల 
సాగుయే లక్ష్యంగా
ముందుకు సాగాలి 

శాస్త్రీయ సాగుతో 
సస్యశ్యామలమై
సాగు స్వయం 
స్వమృద్దితో సాగాలి
అప్పుల ఊబిలో 
చిక్కినరైతన్నను 
సబ్సిడీ రుణాలతో 
ఆదుకోవాలి 

పాలకులు రైతే 
సంక్షేమమే కేంద్రంగా 
సాగువిధానంతో చేయూత
నిచ్చి ఆన్నధాతలను 
ఆదుకోవాలి

జై జవాన్ జై కిసాన్
అనే నినాదాన్ని  కర్షక 
సంక్షేమవిధానంగా 
అమలు చేయాలి 

రైతునే నిజమైన 
రాజును చేయాలి 
అన్నదాతల ఆత్మ హత్యాలు 
ఆపాలి భారత్ ను 
అన్నపూర్ణగా నిలుపాలి

నేదునూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం 9440245771
కరీంనగర్

Tags:

About The Author

Latest News