భగవంతుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది వైద్యుడు...

భగవంతుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది వైద్యుడు...

 ప్రాణం కాపాడే పోరాట యోధులను సన్మానించుకోవడం గొప్పవరం... మెడికవర్ హాస్పిటల్స్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) భగవంతుడు జన్మనిస్తే ఆపద, ప్రాణాపాయ సమయంలో పునర్జన్మనిచ్చేది వైద్యుడిని మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం పేర్కొంది... వైద్యులు అందిస్తున్న నిస్వార్థ అంకిత భావానికి ప్రతి ప్రాణం కాపాడేందుకు పోరాడే యోధులను డాక్టర్స్ డే సందర్భంగా సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ ఆవీన్ సనార్ వాస్కులర్ సర్జన్ ను, మరియు సీనియర్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ జాజును మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ యజ్ఞ డి ఎం ఎస్ మరియు మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వైద్యులు వైద్య సిబ్బంది మాట్లాడుతూ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకోని డాక్టర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.. భగవంతుడు మనిషికి జన్మనిస్తే ఆపద సమయంలో ప్రాణాపాయ స్థితిలో నిస్వార్ధంగా అంకితభావంగా ప్రతి ప్రాణం కాపాడేందుకు కత్తి చేతులు పట్టుకుని ప్రాణాలు కాపాడేందుకు పోరాటి యోధులు వైద్యులు అని కొనియాడారు... అది కేవలం ఆపరేషన్ కాదు భగవంతుడు ప్రాణాన్ని కాపాడేందుకు మరో అవకాశం వైద్యులకు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.. వైద్యుల్ల త్యాగం కృషి వెలకట్టలేనిదని వారు చెప్పారు.. మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ తరపున ప్రతి వైద్యునికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, డాక్టర్ యజ్ఞ డిఎంఎస్ , సెంటర్ హెడ్ స్వామి, మెడికల్ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News