మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 గురికి జైలు శిక్ష మరియు 6 మందికి జరిమానా.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 17 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించారు. ఈ క్రమంలో జులై 1వ తేదీ నాడు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని నేడు  జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా  బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్  శిక్షలు విధించారు..
నిజామాబాద్  అంబేద్కర్‌కాలనీ కి చెందిన రాజు కు నిజామాబాద్ 02 రోజుల  జైలు శిక్ష విధించగా రాథోడ్ సూర్య సంతోష్‌నగర్ నిజామాబాద్ కు చెందిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు అలాగే వేముల చిన్న యోగేష్  వినాయకనగర్ 02 రోజుల జైలు శిక్ష, నర్సారెడ్డి  బ్యాంక్‌కాలనీ నిజామాబాద్ ఒక రోజు జైలు శిక్ష మరియు  మల్లికార్జున్ నవీపేట్ కు చెందిన వ్యక్తికి 01 రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే నాలుగో టౌన్ పరిధిలోని బోర్గాం గ్రామానికి చెందిన రాజుకు ఒకరోజు జైలు శిక్ష మరియు నవీపేట్ పోలీస్ స్టేషన్  పరిధిలోని పండనోళ్ల నాగపూర్ కు చెందిన రాజు  07 రోజుల జైలు శిక్ష విధించారు..నిజామాబాద్  రూరల్ పి.యస్ పరిధిలోని నయాబ్ రసూల్ నైబ్ ,కోకిలంపాడుకు, ప్రకాశం  02 రోజులు  జైలు శిక్ష అలాగే నిజామాబాద్  రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సువాడ సాయిలుకు  02 రోజులు  జైలు శిక్ష..డిచ్ పల్లి పరిధిలోని సుద్ధపల్లి కి చెందిన  షేక్ సకీమ్ ఒక రోజు జైలు శిక్ష.అలాగే ధర్మారం గ్రామానికి చెందిన  సిద్దులుకు ఒక రోజు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు..  ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమముగా ఉంచుకోవాలని సూచించారు..

Tags:

About The Author

Related Posts

Latest News