బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) భారతీయ జనతా పార్టీ   వేద కన్వెన్షన్ లో నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నారపరాజు రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా అర్బన్  శాసనసభ్యులు  ధన్ పాల్ సూర్యనారాయణ  శాలువతో సత్కారించి,పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రామచందర్    సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులని అన్నారు.. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో అనుభవం కలిగిన నేత అని అన్నారు.రామచందర్  నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.రామచందర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశగా పార్టీ ముందుకు సాగుతుందనే విశ్వాసం ఉందన్నారు.కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను నూతన అధ్యక్షుడు విజయవంతంగా నెరవేరుస్తారని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News