జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా

-డాక్టర్ శ్రీధర్ రెడ్డిని సన్మానించిన..రామస్వామి యాదవ్

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జులై 14 తారీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి లో ఘనంగా రామస్వామి యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించారు. చందానగర్ స్మిత దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవా సత్పరతను గుర్తించి ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా మాజీ ఫ్లోర్ లీడర్ రామస్వామి యాదవ్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని, ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు అని కొనియాడారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని గుర్తు చేశారు. ప్రజల కోసం కృషి మరింత కొనసాగించాల ని ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమంలో రామస్వామి యాదవ్ తో పాటు డాక్టర్ రవి అండ్రస్, డాక్టర్ రాజేష్ రెడ్డి, కెప్టెన్ రవీంద్ర కుమార్, యూనివర్శిట్ వైస్ చాన్సలర్ బిజే రాధ, శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News