ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం
By Ram Reddy
On
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్.
*-
*లోకల్ గైడ్/ తాండూర్:*
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం అని కోట్ పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ అన్నారు.సోమవారం కోట్ పల్లి మండల ఎంపీడీవో లక్ష్మినారాయణ పదివి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి జీవితంలో పదవి విరమణ సహజం అని అన్నారు.కాగా మండలంలో లక్మినారాయణ సేవలు అమోఘం అని కీర్తించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో కోట్ పల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్,యాత్ ప్రెసడెంట్ కొండల్ రెడ్డి, మండల్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ రషీద్, యువ నాయకులు రాజు,తదితరులు పాల్గొన్నారు.
Tags: