వైద్యుల సేవలు వెలకట్టలేనివి
-కార్పొరేటర్ రాగం..నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మదర్ సేవ సమితి ట్రస్ట్ ఛైర్మెన్ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు అని కొనియాడారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని గుర్తు చేశారు. ప్రజారోగ్యం కోసం తమ కృషి మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాకేష్, డాక్టర్ ఉమాదీపిక, డాక్టర్ జోష్ణ, మదర్ సేవ సమితి ట్రస్ట్ ఛైర్మెన్ బద్దం కొండల్ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, సుభాష్, మహేష్ చారీ, తుకారాం, పెంటయ్య, గౌతమ్, కృష్ణ, షైబాజ్, ముంతాజ్ బేగం, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.