సీసీ రోడ్డుపై పెద్ద రంధ్రం.

సీసీ రోడ్డుపై పెద్ద రంధ్రం.

- కోట్ల హనుమాన్ దేవాలయం దగ్గర పొంచి ఉన్న ప్రమాదం 

- సమస్యను పరిష్కరించాలని స్థానికుల ఆవేధన.

లోకల్ గైడ్/ తాండూర్: 
పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్ల హనుమాన్ దేవాలయం దగ్గర మోరీ  పైన సీసీ బెడ్డు పాడై, పెద్దగా రంధ్రం ఏర్పడింది. నిత్యం ఇదే మార్గం గుండా ఎస్సీ కాలనీ నుంచి తాండూర్ సంగారెడ్డి ప్రధాన రహదారి గుండా అనేకమంది రైతులు వాహనదారులు, వెళ్తుంటారు.ఆదమరిచి వానంపై వేగంగా వెళితే గనక రంధ్రంలో పడి ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎస్సీ కాలానికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, కోట్ల హనుమాన్ దేవాలయం ముందు భాగం నుంచి మోరి ఉండటంతో, మోరి నీరు కూడా సాపీగా వెళ్లలేక నీరు మొత్తం రోడ్డుపైకి ప్రవహించడంతో, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి మోరిపైన సిసి బెడ్ ను నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ఎస్సీ కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు.

Tags:

About The Author

Latest News