మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఆర్థిక సహాయం

-సిగాచి ఫార్మా పరిశ్రమని సందర్శించిన సిఎం

-పరిశ్రమలో రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో సమీక్ష

-ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు

-చేపట్టాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఇస్నాపూర్ మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమను మంగళవారం సందర్శించిన సిఎం రేవంత్ రెడ్డి. భారీ అగ్ని ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఆవరణలో రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలియజేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రమాద నికి గల కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు  తీసుకుంటం అని అల్లారు. ఇలాంటి సంఘటనలు ఇతర పరిశ్రమ లలో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. నిరంతరం అధికారుల బృందం పరిశ్రమలను తనిఖీ చేయాలని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నచోట జాగ్రత్త చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం పరిశ్రమలు ఫైర్ సేఫ్టీ శాఖల అధికారులను ఆదేశించారు. పరిశ్రమలలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యంతో కలిసి రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి కుటుంబీకులకు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యం కలిసి రూ. కోటి రూపాయలు,  తీవ్రంగా గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల రూపాయలు, స్వల్పంగా  గాయపడిన కార్మికులకు రూ.5 లక్షల రూపాయలు   ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తక్షణ సహాయంగా మృతుల కుటుంబ సభ్యులకు రూ లక్ష రూపాయలు, క్షతగాత్రులకు, రూ.50 వేల రూపాయలు అందజేయాలని స్థానిక కలెక్టర్ కు ఆదేశించినట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఇతర పెద్ద ఆసుపత్రులకు తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేర్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో గాయపడిన మృతి చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి పఠాన్ చేరు లోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ,  దుద్దిర్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, టిఎస్ఐడిసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News