జనగామ జిల్లా. ప్రతినిధి (లోకల్ గైడ్):-
మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హిందూ సంస్థల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ప్రముఖ ఆధ్యాత్మిక వక్త , గో సేవ విభాగం తెలంగాణ ప్రాంత ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ తరాలైన యువ విద్యార్థిని విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పశు సంరక్షణ, పోషణలపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛమైన వాతావరణం, నాణ్యమైన జీవన ప్రమాణాలతో భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు మార్గనిర్దేశన చేసేందుకు వచ్చే సెప్టెంబర్ నెలలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో యావత్ విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొనాలని, పాఠశాలలు, కళాశాలల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతలు ఆపై నగర స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు విశేష గుర్తింపు, బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, గో సేవ జనగామ దమ్మన్న మాధవరెడ్డి, ముక్క స్వామి, చిక్కుడు నగేష్, సత్యం, అంచూరి రమేష్, యెలసాని కృష్ణమూర్తి, రాంబాబు, భజరంగ్ దల్ నగర కన్వీనర్ యామంకి రాఖేష్ తదితరులు పాల్గొన్నారు..