బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్యం వేంకట్ రెడ్డి అంతిమయాత్ర లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
మిడ్జిల్ జులై 1(లోకల్ గైడ్):
మిడ్జిల్ మండలం గ్రామ మాజీ సర్పంచ్ రాధికా భర్త బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్యం వేంకట్ రెడ్డి సోమవారం ఉదయం ఆకస్మికంగా మరణించారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మంగళ వారం మిడ్జిల్ మండలానికి చేరుకుని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్యం వేంకట్ రెడ్డి అంతిమయాత్ర లో చివరి వరకు పాల్గొన్నారు, అనంతరం మన్యం వేంకట్ రెడ్డి పొలం దగ్గర జరిగిన అంత్యక్రియలలో పార్థివ దేహాన్ని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సందర్శించినివాళులర్పించారు,ఈ సందర్భంగా మిడ్జిల్ మండల సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వేంకట్ రెడ్డి అకాల మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు,వారి మరణం మిడ్జిల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు