5 న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సర్వేలు జయప్రదం చేయండి.

5 న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సర్వేలు జయప్రదం చేయండి.

        ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్లు అడుగు ప్రభావతి పిలుపు.

నల్లగొండ. లోకల్ గైడ్:

  ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మందుల కొరత డాక్టర్ల కొరత తీర్చాలని పి హెచ్ సి స్థాయిలో ఉన్న సమస్యలను వెలికి తీయడానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఒకరోజు సమగ్ర సర్వేలు నిర్వహించనున్నట్లు ఈ సర్వేలోప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వార్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలుడు ప్రభావతి పిలుపునిచ్చారు.  మంగళవారం రోజున మర్రిగూడ మండల కేంద్రం రాజుపేట తండాలో ఐద్వా ఆధ్వర్యంలో ఐద్వా సభ్యత్వ నమోదుకార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సరియైన వసతులు కల్పించాలని ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు   ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అధికమైందని ప్రభుత్వ వైద్యo నిర్లక్ష్యానికి గురికావడం వలన ప్రజలలో అపనమ్మకం ఏర్పడి ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్నారని తెలిపారు.  ఈ అపవాదు తొలగించడానికి ఐద్వా తరఫున కృషి చేయనున్నట్లు తెలిపారు   ప్రజలకు చిత్తశుద్ధితో మెరుగైన వైద్యం అందించినట్లయితే అత్యధికంగా ప్రజలు ఉచిత వైద్యానికే వస్తారని తెలిపారు.  ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నూతన టెక్నాలజీతో పరికరాలు, ఎక్స్రేలు ల్యాబ్లు,రక్త పరీక్షలు విరివిగా చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలఐద్వా కార్యదర్శి దామెర లక్ష్మీ నాయకురాలు కొడదల కల్పన కేశ బోయిన యాదమ్మ భుజాలు సోనా లలిత వెంకమ్మ లక్ష్మీ మల్లమ్మ రాములమ్మ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News