ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేల మాట్లాడిన అర్వపల్లి పురుషోత్తం తక్షణమే క్షమాపణ చెప్పాలి...

ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేల మాట్లాడిన అర్వపల్లి పురుషోత్తం తక్షణమే క్షమాపణ చెప్పాలి...

  • ఓటమి భయంతో ఇస్టారీతిన మాట్లాడడం సరికాదు... ఎన్నికలకు రాజకీయ రంగు పులిమే యత్నం మానుకుంటే బాగుంటుంది...
  • ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల అధ్యక్ష  అభ్యర్థి ధన్ పాల్ శ్రీనివాస్...*

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల సందర్బంగా అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా  ప్రెస్ క్లబ్ లో  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ఆర్యవైశ్య పట్టణ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందని అన్నారు..ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్దే లక్ష్యంగా సేవే పరమవధిగా నిర్ణయం తీసుకొని తమ ఫ్యానల్  సభ్యులు పట్టణ సంఘం ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరుగుతుందన్నారు.
తమ ఫ్యానల్ సంఘ బాధ్యతలు స్వీకరిస్తే  ప్రధాన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు..
ముఖ్యంగా అర్హులైన పేద వైశ్యులకు 10 లక్షల యాక్సిడెంట్ బీమా & ఉచిత మెడికల్ క్యాంపుల  నిర్వహించడం జరుగుతుంది.. అలాగే
ప్రస్తుతం 50 మందికి ఇస్తున్న 500 రూపాయల పెన్షన్ను అర్హులైన పేద ఆర్యవైశ్యులందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. ప్రతి సంవత్సరము అర్హులైన పేద ఆర్యవైశ్య కుటుంబాలలో నుండి 50 మంది విద్యార్థులను చదివించడం జరుగుతుందన్నారు.. పేద ఆర్యవైశ్యుల కుటుంబాలలో ఎవరైనా స్వర్గస్తులైనప్పుడు అంత్యక్రియలను నిర్వహించుటకు ఆర్థిక సహాయాన్ని అందించడం.
అలాగే సొంత స్థలం కలిగి ఉన్నటువంటి అర్హులైన పేద ఆర్యవైశ్యులకు ఇంటి నిర్మాణ నిమిత్తం కొరకై ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు...
ధన్ పాల్ అంటేనే నిజామాబాద్ జిల్లాలో ఒక బ్రాండ్ ఉందని సేవకు మారు పేరుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే చరిత్ర ఉన్న కుటుంబం నుండి వచ్చిన తను  గతంలో నూతన వైశ్య ఉన్నత పాఠశాల అధ్యక్షునిగ,శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ సంయుక్త కార్యదర్శిగా,రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నందు పలు రకాల పదవులు నిర్వహించడమే కాకుండా 100 సంవత్సరాల చరిత్ర గల గోషాలా కోశాధికారిపని చేసిన నయ రూపాయి కరప్షన్ లేకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.
ఆర్యవైశ్య కుటుంబాలకు, సమాజానికి మరింత సేవచేసే అవకాశం కల్పించాలని జులై 6 తారీఖున జరిగే పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో తమ ఫ్యానల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.తన ప్రత్యర్థిగా  పట్టణ సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అర్వపల్లి  పురుషోత్తం గుప్త  రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఓడిపోతున్నా అనే ఆవేశంలో నోటికొచ్చిన మాటలు  మాట్లాడుతూ  ఆర్యవైశ్య సమాజాన్ని అపహాస్యం చేసిండని మండిపడ్డారు..పురుషోత్తం గెలిస్తే ఆర్యవైశ్య సమాజానికి ఏమి చేస్తారో చెప్పే క్లారిటీ లేక సంఘ ఎన్నికలకు రాజకీయ రంగు పులమాలని చూస్తున్నాడని దీనిని  తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.
రాజకీయ నాయకులు సంఘం ఎలక్షన్లలోకి ఎందుకు వస్తున్నారు? వారికి ఎందుకు గులగుల? మరియు వారికి భవిష్యత్తు ఉండదు అనే అనవసరమైన ప్రసంగం చేయడం చుస్తే ఆయనకు ఓటమి భయం పట్టుకొని మతి తప్పి గతి లేని మాటలు మాట్లాడుతున్నట్లు అర్ధమవుతుందన్నారు..
పురుషోత్తం గుప్తా సూటిగా ప్రశ్నిస్తున్న అంటు రాష్ట్రవ్యాప్తంగా మన వైశ్య కమ్యూనిటీలో రాజకీయాలలో ఉన్నది ఇద్దరే ఇద్దరు డైనమిక్ లీడర్స్ ఒకరు  ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మరొకరు బిగాల గణేష్ గుప్తా  వీరిలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలన్నారు.ఆర్యవైశ్య సమాజం ఇప్పుడిప్పుడే రాజకీయంగా చైతన్యం అవుతుంటే అది చూసి  ఓర్వలేక యావత్ మన ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచే మాటలు మాట్లాడటం తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తక్షణమే పురుషోత్తమ్ గుప్తా ఈ మాటలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేసారు..లేకపోతే రానున్న ఎలక్షన్ లో ఆర్యావైశ్య సోదరసోదరీమణులు ఓటుతో తగిన బుద్ది చెప్పడం ఖాయం అని హెచ్చరించారు.
గతంలో మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలలో భాగంగా జిల్లా స్థాయిలో ఒక కోటి రూపాయల విద్యానిధిని సమకూర్చలేని మీరు ఇప్పుడు పట్టణ స్థాయిలో రెండు కోట్ల రూపాయల అభయ నిధిని ఎలా సమకూరుస్తారు అని అందరూ చాలా అయోమయంలో ఉన్నారు దానికి ముందు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.కాబట్టి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, మా ఫ్యానల్ కి ఒక అవకాశం ఇచ్చి ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష పదవికి ఎన్నుకున్నట్లయితే ఇలా మాటలలో కాకుండా చేతలలో తన వంతు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస గుప్తా, పెద్ది జగదీశ్వర్ గుప్తా, పబ్బ  రాజగుప్త, బరుడువార్ అనిల్ గుప్తా, వీరమల్లి రమేష్ గుప్తా, దొంతుల రాజా ప్రతాప్ గుప్తా మరియు ప్యానల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News