రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌

రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌

మంత్రి సీత‌క్క వెంట ట్రైకార్ చైర్మ‌న్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు బెల్ల‌య్య నాయ‌క్, ఇత‌ర నేత‌లు

లోక‌ల్ గైడ్:
జైలులో లఖ్మాను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఘీభావం తెలిపిన అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన మంత్రి సీత‌క్క మాట్లాడుతూమాజీ మంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యే, ఆదివాసిల‌ అగ్ర నేత క‌వాసీ లఖ్మాని అకార‌ణంగా అరెస్టు చేశారు.రాజ‌కీయ కక్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే లఖ్మాని బీజేపీ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసుల‌తో వేధిస్తుంది.నిరాధార‌మైన కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్నారుఏలాంటి సాక్షాదారాలులేకుండానే త‌ప్పుడు కేసులతో ఆరు నెల‌లుగా జైలులో పెట్టారు.బ‌స్త‌ర్ లో ఆదివాసీల గొంతుక‌గా ఉన్న ల‌ఖ్మా అక్ర‌మ అరెస్టును ఖండిస్తున్నామ‌ని,ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను బీజేపీ ప్ర‌భుత్వం బలవంతంగా తరిమివేస్తోందన్నారు.ఆదివాసీల అణ‌చివేత‌లో బాగంగానే ల‌ఖ్మాపై త‌ప్పుడు కేసులు న‌మోదు చేశారని,కవాసీ లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండ‌గా నిలుస్తోంది. ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప‌క్షాన పోరాటం కొనసాగుతోందని అని అన్నారు. మంత్రి సీత‌క్క వెంట ట్రైకార్ చైర్మ‌న్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు బెల్ల‌య్య నాయ‌క్, ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News