కార్మికుల కుటుంబాలకు అధికారులు, పరిశ్రమల యాజమాన్యం భరోసా ఇవ్వాలి
పరిశ్రమ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి
( లోకల్ గైడ్ న్యూస్ షాద్ నగర్)
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి సుమారు 50 మందికి పైగా కార్మికులు మరణించడం తీవ్రంగా కలిచి వేసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.శవాలు గుర్తుపట్టలేని స్థితిలో మాంసపు ముద్దలుగా పడిన తీరు చూస్తుంటే ఆ పేరులు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలే గత సంవత్సరం షాద్ నగర్ లో గ్లాస్ కంపెనీలో జరిగిన దుర్ఘటనలో అనేకమంది మరణించిన తర్వాత కూడా అధికారులు అన్ని కంపెనీలు తిరిగి తనిఖీ చేసి భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయా లేదా అని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా ఫ్యాక్టరీల యజమానులు, రెవెన్యూ అధికారులు ,పోలీసు అధికారులు ఫ్యాక్టరీల భద్రత అధికారులు సమిష్టిగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి తక్షణమే షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి ప్రజలకు కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రజల నుండి ప్రజా సంఘాల నుండి ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన నిరసనలు పోరాటాలు తప్పవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు హెచ్చరించారు..