మహిళా పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

మహిళా పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

లోకల్ గైడ్: ఖమ్మం:

పోలీసు స్టేషన్ ఆశ్రయించే మహిళల ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకుఆదేశించారు. బుధవారం మహిళా పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్   ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు, చార్జిషిట్ రికార్డులు, సీడీ ఫైళ్లను పరిశీలించి  అధికారులు పలు సూచనలు చేశారు.ఆనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వారి రక్షణకై చర్యలు చేపట్టాలని అన్నారు. మహిళల సమస్య పరిష్కారంలో భాగంగా మహిళా పోలీసు స్టేషన్ ఆశ్రయించే మహిళలు, వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలతో మర్యాదగా మాట్లాడాలని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని, ఫిర్యాదులవట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు.అదేవిధంగా విధిగా కళాశాలలు, పాఠశాలలను, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మహిళా పోలీసు సిబ్బంది సందర్శించి, వారికి రక్షణగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.

Tags:

About The Author

Latest News