ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.

ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.

  సి.సి.టి.విల ఏర్పాటు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.

కొండ మల్లెపల్లి పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి  తనిఖీ చేసిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.


నల్లగొండ .లోకల్ గైడ్.  దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కొండమల్లె పల్లి పోలీస్ స్టేషన్ ను అర్ధ రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి  పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి  తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.
       ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో నేర నియంత్రణలో భాగంగా  సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ  ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  అసాంఘిక కార్యకలాపాలు  గంజాయి, జూదం,అక్రమ ఇసుక,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి  జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్పి గారి వెంట కొండమల్లె పల్లి  సి.ఐ నవీన్ కుమార్, యస్.ఐ అజ్మీరా రమేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్