ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు.....

ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు.....

జన జీవనం సమస్తం
ప్లాస్టిక్ పీడన మయం
ఎక్కడ చూసినా ఏమున్నది
గర్వకారణం 
సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగుల
బూతమే
పల్లె నుండి పట్నం వరకు
పేదవాడి నుండి ధనికుని
వరకు సౌకర్యం పేరున
ప్లాస్టిక్ కవర్ల వినియోగం
జీవన శైలి అయ్యింది

మానవ స్వార్థం పడగ 
విప్పింది సింగిల్ యూజ్   
ప్లాస్టిక్ కవర్లతో భూకాలుష్యం 
పర్యావరణ కాలుష్యం 
జల కాలుష్యం పెరిగి 
ప్రజారోగ్యం ప్రమాదంలో
పడింది ఆరోగ్య చికిత్సపై
ఖర్చులు పెరిగి ఆర్థికభారం 
పెరిగి కుటుంబాలు ఆర్థికంగా
కుంగి పోతున్నాయి
ప్లాస్టిక్ వినియోగం వైద్య 
ఆరోగ్య రంగానికి
సవాల్ గా పరిణమించింది
వింత వ్యాధులు ప్రభలి వైద్య 
ఆరోగ్య రంగ సంక్షోభానికి
దారితీసి ప్రజారోగ్యం
 క్షీణించింది

సముద్ర జీవులు 
అంతరిస్తున్నాయి
కలుషిత కారకాలను 
నిషేదించాలి

ప్లాస్టిక్ బ్యాగ్  వద్దు
గోనె సంచే ముద్దు
పేపర్ బ్యాగ్ వాడుధాం
పర్యావరణాన్ని రక్షిధ్ధాం 
క్లాత్ బ్యాగ్ వాడుధాం
కాలుష్యాన్ని అరికడదాం

మట్టి పాత్రలు వాడుధాం 
ప్రజారోగ్యాన్ని సంరక్షిద్దాం
పర్యావరణ హిత పద్ధతులు 
పాటిద్దాం హరిత 
సంస్కృతిని ప్రోత్సాహిద్దాం
పునరుత్పాదక శక్తి
వనరులను వాడుదాం 
ప్రకృతిని రక్షిద్దాం

బయో టెక్నాలజీ ఎనర్జీ  
పవన విద్యుత్ శిలాజ 
ఇంధనాలు
ప్రత్యామ్నాయ శక్తి వనరుల 
సద్వినియోగంతో 
కాలుష్య రహిత పరిశ్రమలు
పచ్చదనం పరిశుభ్రత
కాలుష్య రహిత ప్రకృతిని 
భవిష్యత్ తరాలకు
కానుకగా ఇద్దాం

గో గ్రీన్ నో ప్లాస్టిక్  
జీవన విధానం కావాలి 
సింగిల్ యూజ్  ప్లాస్టిక్ కవర్ల
నిర్మూలనకు  ప్రతిజ్ఞ చేద్దాం
ప్లాస్టిక్ బ్యాగ్ రహిత సమాజ 
స్థాపనకు ప్రతిన బూనుధాం
మన రేపటి ఆరోగ్యాలను 
మనమే కాపాడుకుందాం
ఆరోగ్య భారత్ ను 
ఆవిష్కరిధ్దాం
ప్రకృతి పర్యావరణాన్ని 
కాపాడుదాం దేశ ప్రగతి
పురోగతిని సాధిద్దాం
భావితరాలకు 
ఆరోగ్యవంతమైన 
ప్రపంచాన్ని అందిద్దాం

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం 
మాజీ కరెస్పాండెంట్  జస్టిస్ 
కుమారయ్య లా కాలేజీ 
కరీంనగర్
(ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు చీఫ్ 
జస్టిన్ జస్టిస్ కుమారయ్య) 

కరీంనగర్9440245771

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్