గుంతలమయంగా రహదారి.
- కందనెల్లి తాండలో రోడ్డుపైన ఏర్పడ్డ గుంతలు.
లోకల్ గైడ్/ తాండూర్:
తాండూర్ నుండి సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారికి సంబంధించి, కందనెల్లి తండా గ్రామం వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా తయారయింది.రహదారి పైన ఏర్పడిన గుంతలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏ మరుపాటు వహించిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా,గత రెండు మూడు రోజుల నుంచి అడపాదడపా కురిసిన వర్షాలకు రహదారి పైన ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడంతో, గుంతలు కనిపించక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు మండిపడుతున్నారు.ముఖ్యంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు పాస్ కాకపోవడంతో, ఎటుపక్క వెళ్లాలో తెలియక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు,సంబంధిత ఆర్అండ్ బి శాఖ అధికారులు స్పందించి, రహదారి పైన ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేసి, తమ ప్రాణాలను కాపాడాలని వాహనదారులు అధికారులను వేడుకుంటున్నారు.