బ్రిడ్జి నిర్మాణానికి 121.92 కోట్ల రూపాయల మంజూరు పట్ల హర్షం
- కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత.
గద్వాల, లోకల్ గైడ్ :
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పై హై లెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత కృతజ్ఞతలు తెలిపారు. శనివారం రోజు జూరాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల హై - లెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి జీవో వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో ఇచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు హై లెవెల్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ నరసింహ, జిల్లా మంత్రి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి లకు గద్వాల నియోజకవర్గ రైతాంగం ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.