హోం గార్డు ఆఫీసర్ల కు వులెన్ జాకెట్ల పంపిణీ

హోం గార్డు ఆఫీసర్ల కు వులెన్ జాకెట్ల పంపిణీ

నిర్మల్ : లోకల్ గైడ్ :

పోలీసు వ్యవస్థలో హోం గార్డులు కీలకమైన భాగస్వాములు. శ్రమ, నిబద్ధత, సేవా దృక్పథంతో ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడు ముందుంటారు. వర్షాకాలం వంటి క్లిష్టమైన కాలాల్లో సైతం తడిసి ముద్దవుతూ తమ విధులు నిర్విరామంగా నిర్వహించే హోం గార్డుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని, నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బుదువారం ఉదయం భైంసాలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 208 మంది హోం గార్డులకు వర్షాల కారణంగా జరిగే అసౌకర్యాలను తగ్గించేందుకు వూలెన్ జాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హోం గార్డుల సంక్షేమం పట్ల పోలీస్ శాఖ నిబద్ధంగా ఉందని, హోం గార్డులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందు వీటిని వినియోగించుకోవచ్చు అని  తెలిపారు.వులెన్ జాకెట్ల పంపిణీ హోం గార్డుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. తమ శ్రమను గుర్తించి, అవసరమైన సమయంలో అవసరమైన సహాయం అందించినందుకు జిల్లా ఎస్పీకి హోం గార్డులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ డా: జి. జానకి షర్మిల తో పాటు ఆర్ఐ రామ్ నిరంజన్ రావ్ (అడ్మిన్) హోం గార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News