పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను సందర్శించిన

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను సందర్శించిన

-ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో, బుధవారం సంఘటనా స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ సందర్శించారు.వారితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, పఠాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరిశ్రమ పరిసరాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు సంఘటనా ప్రాంతంలోని పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకొని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News