లోకల్ గైడ్.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకై, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని జరిగే దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మె ను విజయవంతంచేయాలని ఐఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ లో ఐఎఫ్ టి యు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి అనంతరం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర భారతంలో భారత కార్మిక వర్గం అనేక సమస్యలను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు.దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం 50 కోట్లపైగా ఉన్నారని,వీరికి ఉన్నటువంటి హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ. కనీస వేతనాల పెంపు. ఉద్యోగ భద్రత. ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై సార్వత్రిక సమ్మె జరుగుతుందని అన్నారు. వ్యాపార లాభ పెక్షతో పని గంటలను పెంచుతున్నారని, 8.గంటల పని దినాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులకు కనీస వేతనం 26.000/- ఇవ్వాలని తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసంఘటిత కార్మికులైనా ఆటో మరియు మోటారంగ కార్మికులు, హమాలీ కార్మికుల జీవితాలకు సామాజిక భద్రత లేదని వారికి సమగ్రమైన సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పనున్నారని, దీనితో కార్మికులు సంక్షేమ పథకాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు పొందటానికి ప్రభుత్వం అనేక కోర్రీలు పెడుతుందని, ఇది కార్మిక వర్గానికి తీవ్రనష్టకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్మిక సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని, కేజీబీవీ , మిషన్ భగీరథ,గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పరిశ్రమలలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, రాష్ట్రంలో 600 పైగా ప్రమాదాలు జరిగిన చర్యలు లేవని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. కార్మికులు జులై 9న జరిగే సమ్మెలో పాల్గొనీ విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్, జిల్లా నాయకులు ఉంగరాల నరసింహ, మాగి క్రాంతి జక్కుల సురేష్, పొట్లపల్లి రామకృష్ణ, శంకర్ నాంపల్లి, వీరేష్ చందు తదితరులు పాల్గొన్నారు.