అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత...

అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) 
అంగన్వాడి టీచర్ల స్థానిక సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు..అనంతరం అధికారికి వినతి పత్రం అందజేశారు.. ఈ  సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకన్న ముందు అంగన్వాడీ టీచర్లను మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.. కానీ ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన  హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.. అంగన్వాడీ టీచర్ల స్థానిక సమస్యలు ఇప్పటివరకు అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు.. ముఖ్యంగా అంగన్వాడి సెంటర్లలో ఆయాలు లేరు అదేవిధంగా 10 సంవత్సరాల నుండి వంట సామాన్లు లేవు. అదేవిధంగా అంగన్వాడికి పక్కా భవనాలు లేవు అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు నీటి సౌకర్యం ఇప్పటివరకు కేటాయించలేదు. చాలామంది అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం రిటర్మెంట్ చేసింది.. సుమారు 80 మంది అంగన్వాడి  టీచర్లు రిటర్మెంట్ అయ్యారు. ఆ సెంటర్లలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు దానికి భర్తీ చేయలేదు. ఉన్న అంగన్వాడి టీచర్లతో ఇన్చార్జిలుగా పెట్టి ఆ సెంటర్లను నడుపుతున్నారు. ఒక సెంటర్ లో మేడం ఉండి ఇంకో సెంటర్ లో మేడం లేకపోతే అధికారులు వాళ్లకు మెమోలు జారీ చేస్తున్నారన్నారు.. ఇప్పటికైనా అంగన్వాడి స్థానిక సమస్యలు పరిష్కరించి అంగన్వాడీలను ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని అంగన్వాడి అధికారులను కోరుతున్నాము. ఒకవేళ స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే అతి త్వరలో ఆ ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి శివగంగ సెక్టర్ లీడర్ రేణుక గౌరమ్మ శివ జ్యోతి సవిత తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News