పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి
By Ram Reddy
On
లోకల్ గైడ్
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ
దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు ....!
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ
"" చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను , ఈ పాటలో ఉన్న గమ్మత్తు , వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో , ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు , ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట "" అన్నారు ..!
చిత్ర దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ "" తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ప్రశ్నించే పాట ఆవిష్కరించ బడడం తమ యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తుందని "" పేర్కొన్నారు..!!
చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ "" సినీ పెద్దలందరి ఆశీస్సులతో మా
సినిమా ను జూలై మూడవ
వారం లో విడుదల చేస్తున్నాము , త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము , సమాజం లోని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పక్కా కమర్షియల్ సినిమా గా మేము ఈ చిత్రాన్ని
రూపొందించాము "" అని వివరించారు .....!!
చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ "" తను హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం లో రెగ్యులర్ పంథాలో
అందమైన కాస్ట్యూమ్స్ తొడుక్కొని ప్రేమ గీతాలు పాడుకుంటూ హీరోయిన్ వెంట తిరిగే పాత్రను కాకుండా
సీనియర్ నటులు మాత్రమే
పోషించే యాక్టింగ్ సత్తాను చాటుకోవడానికి అవకాశమున్న పాత్రను పోషించే అవకాశం లభించడం
నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను "" అన్నారు...!
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...