మొట్టమొదటి ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రంను ప్రారంభించి

మొట్టమొదటి ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రంను ప్రారంభించి

-సొంత డబ్బులతో కుట్టు కేంద్రముకు ఐదు కుట్టు మిషన్ లను అందజేసిన -పిఏసి చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధి

శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ ప్రతినిధి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో నల్లగండ్ల1 మహిళ సమైక్య అధ్యక్షురాలు వీణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి కుట్టు కేంద్రంను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి 
యుసిడి ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరి లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పిఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పిఏసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో  మొట్టమొదటి ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రంను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చాలా శుభపరిణామం అని, నా వంతు సహాయంగా నా స్వంత ఖర్చుతో కుట్టు కేంద్రం కు ఐదు కుట్టు మిషన్లను అందచేయడం జరిగినది అని,ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళలు కూడా అంది పుచ్చుకుని, ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ప్రతి ఒక్క మహిళా కూడా స్వయం సహాయక సంఘాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణాలు సదుపాయం పొంది అభివృద్ధి చెందాలని అన్నారు. స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఆర్థిక చేయుతనదించేందుకు గొప్పమహిళ శక్తి పథకం అని, సిఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన గొప్ప పథకం ఇందిరా మహిళ శక్తి పథకం అని, ఈ చక్కటి అవకాశంను సద్వినియోగం చేసుకొని స్వయం సహాయక సంఘాల మహిళ సోదరీమణులు ఆర్థికంగా ఎదగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను అని తెలియచేసారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వాళ్ల కాళ్లపై నిలబడడానికి ఆర్థిక స్వాలంభన కొరకై ఇందిరా మహిళ శక్తి కుట్టు కేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రగఢ సత్యనారాయణ, ఇబ్రహిం, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్, కాజా, లక్ష్మణ్ యుసిడి సిబ్బంది, మహిళా సమైక్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్