బైపాస్ రోడ్డుకు భారీ గండి!

బైపాస్ రోడ్డుకు భారీ గండి!

- అర్ధభాగం రోడ్డు చీలిపోయిన వైనం.

- ఆదమరిస్తే అనంతలోకాలకే.

- వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం. 

లోకల్ గైడ్/ తాండూర్: 
తాండూర్ లోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగం నుంచి నిర్మించిన బైపాస్ రోడ్డుకు భారీ గండి ఏర్పడింది.ఆసుపత్రికి వెళ్లే దారిలో, ఆస్పత్రికి కిలోమీటర్ దూరంలో గండి ఏర్పడి, రోడ్డు సగం వరకు చీలిపోయి ప్రమాదకరంగా మారింది.అటుపక్క నుంచి వెళ్తున్న... వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విధంగా గండిపడడానికి ప్రధానంగా భూమి కుదించుకుపోవడం,రోడ్డు నిర్మాణం సమయంలో లోపాలు, డ్రైనేజీ సమస్య,ఇలా కారణాలు ఏమైనాప్పటికీ,నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు భారీ గండి ఏర్పడడంతో,ముఖ్యంగా వర్షాకాలం, భారీ వర్షాలకు గుంతలో నీరు నిలిచి ఘోర రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు అయితే మెండగా ఉన్నట్లు అటు పక్క నుంచి వెళ్తున్న వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ వర్షాలకు గుంతలో నీరు నిలవడం ద్వారా సరైన మార్గం కనిపించక, ద్విచక్ర వాహనాలు, లారీలు సైతం బోల్తాపడే ప్రమాదం ఉందంట ఆందోళన వ్యక్తం చేస్తున్న.కావున ఆర్అండ్ బి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి, ప్రమాద స్థలం వద్ద ఏమైనా సూచిక బోర్డు కానీ, గండిని పూడ్చే కార్యాచరణ చేపట్టి, ప్రయాణికులకు అటు పక్క వెళ్లే వాహనదారులను ప్రమాదం నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్