రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది.

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది.

కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు చలివెంద్రంపల్లి రాజు 

 మండల రైతు వేదికలో రైతులకు ఉచిత విత్తనాలు పంపిణీ.


లోకల్ గైడ్,జిల్లేడు చౌదరి గూడెం.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు చలి వెంద్రo పల్లి రాజు అన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  మండల అధ్యక్షులు చలివేంద్రంపల్లి రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట నరసింహ రెడ్డి, మండల మాజీ ఎంపీపీ తనయులు సన్వవల్లి ఆంజనేయులు చేతుల మీదుగా రైతులకు ఉచిత విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా 
 ఎఓ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ
వానకాలం పంట సాగు నిమిత్తము PRG 176 అనే రకం కందులు మరియు CSV 41 అనే  జొన్న రకం విత్తనాలను చౌదరిగుడం రైతు వేదికలో మండల రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. చౌదరి గూడెం మండలానికి సంబంధించి PR G-176 రకం అనే కందులు 300 బ్యాగులు మరియు CSV 41  అనే జొన్నరకం 100 బ్యాగులు రావడం జరిగిందని ఒక్కొక్క బ్యాగు నాలుగు కిలోల చొప్పున ఉంటుందని చెప్పడం జరిగింది ఆసక్తిగల రైతులు సంబందిత  క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి పట్టాదార్ పాస్ బుక్ మరియు  ఆధార్ కార్డు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
 ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రజా ప్రభుత్వమన్నారు.రైతు మేలుకోరి రైతులకు ఉచిత విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఆసక్తి ఉన్న రైతులందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి,మాలాంటి రైతులకు మేలు చేసినందుకు ప్రియతమ సిఎం రేవంత్ రెడ్డికి ,ఎమ్మెల్యే శంకరన్నకు రెైతులు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఎఇఓ స్వాతి , మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజర్ అలి,శశిధర్ , జగన్మోహన్ రెడ్డి,నాగేందర్ నాయక్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News