రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...
ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం...
టైర్ పంచర్ తో చోటు చేసుకున్న ఘటన...
గ్రామాల్లో నెలకొన్న విషాద ఛాయలు..
ఉమ్మడి నిజామాబాద్, కామా రెడ్డి జిల్లా : (లోకల్ గైడ్) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం జగన్నాథ్ పల్లి 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.జుక్కల్ మండలం ముహమ్మదా బాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకట్, మంగలి గణేశ్, బిచ్కుంద కు చెందిన నవీన్ అనే ముగ్గురు యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తుండగా జగన్నాథ్ పల్లి వద్ద 161 జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ అయ్యి ఆగిఉన్న కంటైనర్ ను డికోనడం తొ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడి కి తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉండడం తొ మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ కు తరలించగా చికిత్స పొందుతూ ఆ యువకుడు సైతం మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లొని పెద్ద కొడప్ గల్ మండలం జగన్నాథ్ పల్లి గేట్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మారణం చెందగ మరో యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమ్మితం బాన్సువాడ కు తరలించారు. మృతి చెందిన యువకులలో జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోను గంటి వెంకట్ (21).బిచ్కుంద కు చెందిన నవీన్ (21)లుగా గుర్తించగా తీవ్ర గాయలైన మరో యువకుడు మొహమ్మదబాద్ కు చెందిన మంగలి గణేష్ (19)లు గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పెద్ద కొడప్ గల్ మండలం పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగ స్థానికులు తెలిపిన వివరాలప్రకారం మొహమ్మదాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు, బిచ్కుంద కు చెందిన మరో యువకుడు ముగ్గురు స్నేహితులు కలిసి పిట్లం మండలం మారాడు గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనం పై తమ గ్రామానికి వెళ్తుండగా జగన్నాథ్ పల్లి గేట్ సమీపంలో టైర్ పంక్చర్ అయ్యి కాంటైనార్ ను డ్రైవర్ తమ వాహనాన్ని రోడ్డు పై ఆపివున్న కాంటైనార్ ను డికొని మృత్యు వాత పడ్డారు. పోలీస్ లు మృతదేహలను పోస్ట్ మార్టం నిమ్మితం బాన్స్ వాడ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.ఒకేసారి ఇద్దరు మృతి చెందిమరో యువకుడు చావు బతుకుల మధ్య కొన ఊపిరితో పోరాడుతు చివరికి మృతి చెందడం తొ బిచ్కుంద, ముహమ్మదాబాద్ గ్రామాల్లో విషాదంచోటు చేసుకుంది.