ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సుదగాని హరి శంకర్ గౌడ్ లని కలిసి
-బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన..సుభారిగారి రాజు బృందం
చేవెళ్ల, (లోకల్ గైడ్ ప్రతినిధి): చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన సబరిగారి రాజు కురుమ అధ్వరంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ బిసీ పొలిటికల్ జెఏసి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ లను మర్యాద పూర్వకంగా కలిసి, తీన్మార్ మల్లన్న బిసిల రాజ్యాధికార కోసం చేస్తున్న ఉద్యమాన్నికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసీలు అందరూ ఏకమై మన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా 2028 లో బిసి ప్రభుత్వం రావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఏసి సమన్వయకర్తలు ఎలబోయన ఓదేలు యాదవ్, బందారపు నర్సయ్య గౌడ్, బిసి జెఏసి నాయకులు బయ్య వెంకటేశ్వర్లు యాదవ్, గువ్వల సత్తయ్య, సింగాపురం శ్రీశైలం, మద్దె చెన్నరాములు, సబరిగారి సత్తయ్య, సి.హెచ్ రమేష్, వడ్ల జ్ఞానేశ్వర్, చాకత్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.