చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా "బ్లాక్ నైట్" సాంగ్స్, ట్రైలర్ లాంచ్
లోకల్ గైడ్ : శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆల్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ తరానికి తగ్గట్లు మరోసారి అటువంటి సినిమాలను తీసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... "ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ లాంచ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇటీవల కాలంలో ఇటువంటి దైవాత్మక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిత్ర సాంగ్స్, టైలర్ ఎంతో బాగున్నాయి. చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే వారిని మనం ప్రోత్సహించి అండగా నిలబడాలి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. సంగీత దర్శకుడు విజయ్ బొల్లా మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో చేసేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో ఛాలెంజింగ్ తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. సాధారణంగా ఇటువంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు నా వెంట ఉండి చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి అందించిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అన్నారు. నటుడు ఆకాష్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా గురించి ముందుగా నిర్మాతకు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి చాలా థాంక్స్. నాతోపాటు నటించడం మధన్, ఇంకా ఇతర నటీనటులు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ఈ సినిమాకు విజయ్ బొల్లా గారి సంగీతం ఎంతో బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.