సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా "సోలో బాయ్" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హ జూలై 4వ తేదీన విడుదల
ఘనంగా "సోలో బాయ్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ - ముఖ్యఅతిథిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ చిత్ర నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి సతీష్ ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచే మాట్లాడుతూ... "చిత్ర ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నారు. దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత అయ్యారు. ఆయన ఓటిటి ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ ఎంతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా వెండిస్తల పైకి రానున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాలు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు. కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "నాకు ఈరోజే సతీష్ దర్శకుడు కావాలని వచ్చి నిర్మాత వేయాలని తెలిసింది. ఇటువంటిది వినడం ఇదే మొదటిసారి. ప్యాషన్ తో వచ్చి సినిమాలు చేసే అతి తక్కువ మందిలో సతీష్ ఒకరు. అది అతని సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. డైరెక్టర్ కావాలనుకున్న అతని కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రేక్షకులు అంతా పైరసీని అరికడుతూ వెండి ధరపై ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అన్నారు.