రేవంత్‌కి కేటీఆర్ సవాల్: 72 గంటల్లో ఎదురొచ్చి తేల్చుకుందాం

రేవంత్‌కి కేటీఆర్ సవాల్: 72 గంటల్లో ఎదురొచ్చి తేల్చుకుందాం

లోకల్ గైడ్ / హైదరాబాద్ :రైతు సంక్షేమంపై చర్చకు ఎక్కడైనా సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. “72 గంటల్లో రా.. తేల్చుకుందాం. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రా” అని సూటిగా చెప్పారు.

“మూడు రోజుల సమయం ఇస్తున్నా. ప్రిపేర్‌ అయ్యి రా. లేదంటే బేసిన్లు, బెండకాయలు కూడా తెలియని నీకు చర్చకు రావడం ఇజ్జత్ పోయే పని అవుతుంది,” అంటూ ఎగతాళి  చేశారు.

రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చేసినది ఎవరు చేయలేదని, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశాం, ఉచిత విద్యుత్ ఇచ్చాం, పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా కూడా ఇచ్చాం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో చెరువులు కనుమరుగయ్యాయని, కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా వాటికి జీవం పోసాడని వివరించారు.

“కాంగ్రెస్ ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి.. రైతులు లైన్లలో చెప్పులు పెట్టి నిల్చొంటున్నారు. మీ ఇలాంటివాళ్లు రైతులపై చర్చకు పిలుస్తారా? రేవంత్ రెడ్డి, ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు మేం రెడీ” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

“ప్లేస్, డేట్ చెప్పు రేవంత్. నువ్వు పారిపోతే మేం చెబుతాం. ఈ 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రా. వస్తావా? పారిపోతావా? నువ్వే నిర్ణయించు,” అంటూ ఆయన వ్యాఖ్యలు చివరికి చేరుకున్నాయి.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు