అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూలు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...ఏఐఎస్ఎఫ్ రఘురాం డిమాండ్...

అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూలు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...ఏఐఎస్ఎఫ్ రఘురాం డిమాండ్...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల నారాయణ స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజాంబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం అంజలి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నారాయణ విద్యాసంస్థల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ నగరంలోని నారాయణ స్కూల్ ముందట ధర్నా నిర్వహిస్తూ నారాయణ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లేక్క రక్తం పిలుస్తూ వేల కొద్ది రూపాయలు ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. అదే కాకుండా స్టేషనరీ పేరు తో ఒక విద్యార్థి దగ్గర 21 వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీని పైన విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు ఫీజు నియంత్రణ చట్టం అమలు అయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. తక్షణమే నారాయణ విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపు ఇస్తామని అన్నారు. ఈ దర్న కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, నాయకులు నవీన్ కృష్ణ ,టోకు,లక్ష్మణ్ ,రమేష్,దినేష్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్