చార్‌ధామ్‌ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత

చార్‌ధామ్‌ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత

లోక‌ల్ గైడ్:

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వాతావరణ పరిస్థితులు కొంత మెరుగుపడటంతో, ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘చార్‌ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం. వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే వాహనాల రాకపోకలను నిలిపివేయాలి’’ అని సూచించారు.గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్ వద్ద కొండచరియలు విరిగిపడి, నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.అలాగే, కేదార్నాథ్ యాత్రకు ప్రధాన మార్గమైన రుద్రప్రయాగ్‌లోని సోన్‌ప్రయాగ్-ముంకటియా రహదారి కొండచరియలు విరిగిపడటంతో మూసివేయబడింది. భద్రతా పరంగా సోన్‌ప్రయాగ్, గౌరికుండ్‌లలో యాత్రికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్ జిల్లాల సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న నేపథ్యంలో, నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్