మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య.

మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య.

- భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడి.

లోకల్ గైడ్/బంట్వారం: 
మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని, పాశేపల్లి గ్రామానికి చెందిన మేతరి రమేష్(30) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.  అయితే శుక్రవారం తన చెల్లెలి  గ్రామమైన సుల్తాన్పూర్...తన భార్య, పిల్లలతో కలిసి వెళ్లారు. అదే రోజు రాత్రి అందరితో కలిసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో రమేష్.... తన భార్య చూస్తుండగానే ఇంట్లో నుండి బయటకు గోడదూకి పారిపోయాడు, కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికిన ఆచూకీ లభించలేదు. సుల్తాన్పూర్ గ్రామ శివారులో, నాగులపల్లి నారాయణ అనే వ్యక్తి పొలంలో వేప చెట్టు కింద ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు. స్థానికులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు... మృతుడి భార్య మేతరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంట్వారం  ఎస్సై విమల వెల్లడించారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్