డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69* *వర్ధంతి వేడుకలు
బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించిన* *డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్*
By Ram Reddy
On
ప్రపంచంలోనే మొట్టమొదటగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక మూల సూత్రాలను అందించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారత వనికి అందించి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద న్యాయవ్యవస్థ తయారవ్వడానికి కారకులైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు... ఆయన గురువు అయినటువంటి మహాత్మ జ్యోతిబాపూలే సూచించినటువంటి సామాజిక రుగ్మతలను విడనాడి కేవలం కొన్ని వర్గాలకే అక్షరం నేర్చుకునే అర్హత ఉండేది అలాకాకుండా సబండవర్ణాలకు అక్షరం నేర్పించినటువంటి మొట్టమొదట ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అక్షరాన్ని అందించిన వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అయితే వాటిని అన్నిటిని చట్ట రూపంగా దాల్చే విధంగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు...
నిజంగా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ సంస్కరణలను కనీసం పాటించిన ఈ దేశం ప్రపంచ పటంపై ముందు వరుసలో ఉంటుందనడానికి ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ప్రపంచ జ్ఞాన దినంగా ప్రకటించడమే కాకుండా... దాదాపుగా అన్ని దేశాల చట్టసభల ముందు మరియు చట్టసభలలో అంబేద్కర్ గారిని కొలుస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం... కానీ మనదేశంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానం కుంట పడుతుంది, ప్రశ్నించే తత్వం కనుమరుగైపోతుంది నిజంగా ఇదే కొనసాగితే అంబేద్కర్ ఆలోచన విధానం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మారే అవకాశం ఈ దేశంలో ఉంది కావున యావత్ ప్రజానీకం డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం తద్దేమని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అర్ద సుధాకర్ రెడ్డి,మహాజన జిల్లా సోషలిస్టు పార్టీ అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి వికారాబాద్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, టిఆర్ఎస్ నాయకులు పెద్ది అంజయ్య, సీనియర్ నాయకులు పెండాల అనంతయ్య, మాజీ జెడ్పిటిసి ముత్తార్ షరీఫ్, పరశురాం నాయక్, మాజీ కౌన్సిలర్ మురళి, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author
Latest News
06 Dec 2025 23:18:28
వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మార్గ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి
