బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి
బాధిత కుటుంబాలకు పరామర్శ
(లోకల్ గైడ్) కొడంగల్; వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున గొర్రెల మందపై గుర్తు తెలియని టిప్పర్లు, టాంకర్లు వేగంగా దూసుకు వెళ్లడంతో దాదాపు 90 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి మధు సూదన్ యాదవ్ చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులు నాందర్పూర్ కు చెందిన గిరిమి మల్కప్ప, రాయి కంటి ఎల్లప్ప కుటుంబాలు గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
అప్పులు చేసి గొర్రెల పెంపకం పై ఆధారపడ్డ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. అప్పుల పాలైన బాధితులను ఆదుకొని అండగా నిలవాలన్నారు. లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులున్నారు.