తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీకి టెండర్ల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీకి టెండర్ల ఆహ్వానం

 హైదరాబాద్, (లోకల్ గైడ్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది (2025 సంవత్సరం ) చేప పిల్లల పంపిణీకి శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ టెండర్ల లో ఎక్కువమంది పాల్గొనక పోగా నాలుగు జిల్లాల్లో అసలు టెండర్లే తెరచుకోలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది కంటే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ టెండర్లలో వినియోగదారులు అంతగా ఆసక్తి కనబరచలేనిదని తెలుస్తుంది. మొత్తం 33 జిల్లాల గాను 20 జిల్లాల్లో రెండు టెండర్ల చొప్పున ఆన్లైన్ దరఖాస్తులు రాగా 8 జిల్లాల్లో ఒక్కొక్కటి మాత్రమే దరఖాస్తులు వచ్చాయని మత్స్య శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒకటే దరఖాస్తు వచ్చింది. ఇంకా నాలుగు జిల్లాలు కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో ఏ ఒక్కరు టెండర్లల్లో పాల్గొనకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని చెప్పవచ్చు. చేప పిల్లల పెంపకం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ( టెండర్లు) కోరినప్పటికి ఎక్కువ మంది ఈ ఏడాది టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టెండర్ లో పాల్గొన్నందుకు రూ. 25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మత్స్యకారుల సొసైటీ కాకుండా ఆన్లైన్ టెండర్ కావడం వల్ల ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెబుతున్నారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు సకాలంలో అందకపోవడం వల్లనే ఎక్కువ మంది ఈ ఏడాది టెండర్లలో పాల్గొనలేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.

Tags:

About The Author

Latest News