పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌

హనుమకొండ జిల్లా (లోకల్ గైడ్); వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులకు హెచ్చరించారు.ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడాఝా లిపిస్తూ ఓ ప్రకటన చేస్తూ  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా  రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవడంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అతిక్రమించి వాహనదారులు వాహనాలను నడుపతున్నారు. దీనితో పోలీసులు ట్రాఫిక్‌  నిబందనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో పోలీసులు ట్రాఫిక్‌ జరిమానాలు విధించడం జరుగుతొంది. విధించిన ట్రాఫిక్‌ జరిమానాలను సైతం వాహనదారులు సకాలంలో జరిమానాలను చెల్లించకుండా అలసత్వం వహించడం ద్వారా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1,27,194 వాహనలపై  మొత్తం 11,71,094 చలాన్లు పెండిరంగ్‌లో వుందగా, వీటి మొత్తం సూమారు 33 కోట్ల 28 లక్షల రూపాయల్లో మొత్తం వాహనదారులు చెల్లించాల్సి వుంది. ఇందులో వరంగల్‌ ట్రాఫిక్‌ పరిధిలో 3,35,450 చలాన్లు, కాజీపేట ట్రాఫిక్‌ పరిధిలో 3,60,423, హన్మకొండ ట్రాఫిక్‌ పరిధిలో 2,73,770 చలాన్లు పెండింగ్‌లో వున్నాయి. మిగితా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం2,01,451 చలాన్లు పెండింగ్‌ వున్నాయని. ప్రసుత్తం జరిమానాలు చెల్లించని వాహనాల సంబంధించిన పూర్తి  వివరాలు పోలీస్‌ కంప్యూటర్‌ డాటా బెస్‌లో నమోదు కాబడ్డాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.  పెండిరగ్‌  ట్రాఫిక్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకుగాను ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక తనీఖీలు నిర్వహించడం జరుగుతుందని. పోలీసుల తనిఖీ సమయాల్లో పెండిరగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లను వాహనదారులు జమచేయాల్సి వుంటుందని. ఇకపై ఎవరైన పెండిరగ్‌ చలాన్లు చెల్లించకుండా రోడ్లపై వస్తే ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లెట్‌ రికగ్నెషన్‌ కెమెరాల  అధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్‌ ట్యాబ్‌లకు సమచారం వెళ్ళడం ద్వారా పోలీసులు మీ వాహనాలను రొడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్‌ చేయడం జరుగుతుందని  లేని పక్షంలో వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరిలించడం జరుగుతుందని, కావున వాహనదారులు  తమ వాహనాలపై వున్న ట్రాఫిక్‌ జరిమానాలను త్వరితగతంగా చెల్లించాలని పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులకు సూచించారు

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి