టై, బెల్టులు, పౌచ్ కిట్స్ అందజేయడం అభినందనీయం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి జహీర్ (లోకల్ గైడ్); అక్షర ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో సీనియర్ సర్జన్, డాక్టర్ రాజమనోహర్ రెడ్డి, బాలాజి హాస్పిటల్ ,సూర్యాపేట వారి సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల నూతనకల్ విద్యార్థులకు టై అండ్ బెల్టులు, పౌచ్ కిట్స్ నూతనకల్ మండల విద్యాధికారి బానోతు రాములు నాయక్ అందజేశారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సామాజిక సేవలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదని తెలిపారు. విద్యార్థుల చదువుకు ప్రాథమిక పాఠశాలే పునాది అని చక్కటి భవిష్యత్తు ఇక్కడే ప్రారంభమవుతుందని, విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులదే అన్నారు. విద్య, వైద్య, క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాలలో విశేష సేవలందిస్తున్న అక్షర ఫౌండేషన్ ను మరియు బాలాజీ హాస్పిటల్ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామనిపల్లి విద్యాసాగర్, అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యాస రాంకుమార్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ గౌతమ్, డాక్టర్ స్పందన, ఇరుగు సోమయ్య, యాదగిరి, నాగిరెడ్డి శ్రీలత, నాగరాజు, రేణుక, జయమ్మ, సిరి చందనలు పాల్గొన్నారు.
About The Author
