నియోజకవర్గ అభివృద్ధిలో బహిరంగ చర్చకు సిద్ధం...

నియోజకవర్గ అభివృద్ధిలో బహిరంగ చర్చకు సిద్ధం...

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు సవాల్ విసిరారు.మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోను,రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్ కు సరి సమానంగా నిలబెడతానని అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లేని 400మెగావాట్ల సబ్ స్టేషన్,మంచిర్యాల 220మెగా వాట్లా సబ్ స్టేషన్ ను,లక్షెట్టిపేటలో‌ 130మెగా వాట్లా సబ్ స్టేషన్,నస్పూర్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని తెలిపారు.అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే తనపై కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని అన్నారు.బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీశక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.పట్టణంలో శిథిలావ్యవస్థలో ఉన్న బాలుర, బాలికల పాఠశాలల భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని అన్నారు.మంచిర్యాల జిల్లాకు త్వరలోనే నవోదయ హైస్కూల్ మంజూరు అవుతుందని తెలిపారు.సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించి మున్సిపాలిటీ ద్వారా త్రాగునీరు,సానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు.తాను గత 20రోజులుగా అనారోగ్యానికి గురిఅయ్యానని తాను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు,కాంగ్రెస్ నాయకులు,మహిళా నాయకురాలకు,కార్యకర్తలకు,అభిమానులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి