ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష: జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం

ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష: జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం

హైదరాబాదు: లోకల్ గైడ్:

 

 ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,, సీఎస్ శ్రీ రామక్రిష్ణారావు సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో జరిగిన ఈ సమీక్షలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు.

 

 పత్తి కొనుగోలులో ఎల్1 ఎల్2 నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి, 12 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని మంత్రి తెలిపారు.

 

 వర్షాల వల్ల రంగుమారిన సోయా చిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటల సేకరణకు ఈ నవంబర్ నెల కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు