అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న పట్టాను శాశ్వతంగా రద్దు చేయాలని బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామస్తులు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామశివారులో సర్వే నెంబర్ 8లోని గ్రామచావిడి పరంపోగు ప్రభుత్వ భూమిని బట్వాన్ పల్లి గ్రామానికి దుర్గం ధనుంజయ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని చుట్టు కంచె నిర్మించాడని,అదేవిధంగా ఆ కంచెకు ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుండి అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తు ప్రయత్నించాడని ఆరోపించారు.ఈ అక్రమపట్టాను శాశ్వతంగా రద్దు చేసి దుర్గం ధనుంజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ను కోరారు.సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు