సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం        

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం        

 

 నార్కట్ పల్లి, సెప్టెంబర్ (లోకల్ గైడ్); నార్కట్ పల్లి మండల కేంద్రంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగటి మల్లికార్జున్రెడ్డి, మాజీ ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బి. ఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో రాష్ట్ర రోకోచేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమారుగా గంటపాటు సాగిన ఆందోళనలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రేగట్టే మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కాలేశ్వరం ప్రాజెక్టుపై నిరాదార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ అసలైన దురుదేశాన్ని బయటపెడుతుందని విమర్శించారు. ప్రాజెక్టు ద్వారా కోట్ల మంది రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని చూడలేకనే కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి ప్రజాహిత నేతలపై తప్పుడు ఆరోపణ చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలతో, రైతులతో మరియు కార్మికులతో కలిసి బృహత్తర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం లేదని ఆగిపోతున్న అభివృద్ధిని మళ్లీ దూసుకుపోవడానికి బిఆర్ఎస్ కదలికలు విప్లవంలా మారుతాయని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు రైతుల కన్నీళ్లు, విద్యార్థుల కలలు ఇవన్నీ కాంగ్రెస్కు కుతంత్రాలకు బలికాకుండా  రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో చెరువుగట్టు రాజా మాజీ సర్పంచ్ బాలకృష్ణ, పుల్లంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, కొత్త నరసింహ, మేక వెంకట్ రెడ్డి, మహేశ్వరం సతీష్, సత్తిరెడ్డి, ప్రజ్ఞాపురం రామకృష్ణ, చిట్యాల రవిచంద్ర, నాగరాజు, జానీ, పరమేష్, మల్లేష్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.