నల్లగొండ జిల్లాలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

మూసి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన కారణంగా జిల్లాలోని కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినాము.

నల్లగొండ జిల్లాలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేసిన నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 

 

 

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా  . (లోకల్ గైడ్).

  నల్గొండ జిల్లాలో వర్షాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని, మూసి ప్రాజెక్టు  గేట్లు ఎత్తిన  కారణంగా జిల్లాలోని కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని  ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. భారీ వర్షాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,
సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.
 ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పరిస్థితులను జిల్లా కలెక్టర్ మంత్రికి తెలియజేస్తూ మూసి ప్రాజెక్ట్  15 గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి వదలడం జరిగిందని దీనివల్ల భీమారం లో లెవెల్ కాజ్ వే బ్రిడ్జి పై నీరు పొంగి ప్రవహిస్తున్నందున అక్కడ ప్రజలు బ్రిడ్జిని దాటి వెళ్లే సాహసం చేయకుండా  బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాక్టర్లను అడ్డంగా ఏర్పాటు  చేశామని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు లేని కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయం పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని,  వర్షాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం మొత్తం  అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు రెవెన్యూ శాఖ మంత్రి  స్పందిస్తూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేయాలని, ఒకే సారి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల  చేస్తే కాలువ తెగిపోయేందుకు  ఆస్కారం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటి నియంత్రణ  చేయాలని చెప్పారు.
 వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా  అధికారులతో వర్షాల పై సమీక్షిస్తూ  మరో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు రానున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.  వర్షాల కారణంగా ప్రజలకు  ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ  ఫోన్ నెంబర్ 1800 425 1442 కు తెలియజేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేకించి లో లెవెల్ కాజ్ వే ల వద్ద ప్రజలు దాటి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.వర్షాలు కురుస్తున్నందున రైతులకు అవసరమైన యూరియాను అందించేందుకు ముందే  ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడ తాగునీటి పైప్ లైన్ లీకేజీ వంటివి ఏర్పడకుండా చూడాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా,విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ ఘాతం వల్ల పశువులు చనిపోకుండా, పొలాల వైపుకు పశువులు రాకుండా చూడాలని విద్యుత్ శాఖఅధికారులనుఆదేశించారు. 
ఇందుకుగాను వంగిపోయిన స్తంభాలు,
వేలాడుతున్న వైర్లు ఉండకూడదని,  ఉంటే వెంటనే వాటిని సరి చేయాలని, విద్యుత్ అధికారులు,  సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని చెప్పారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండాలని, వర్షాలు తగ్గిన తర్వాత సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పంచాయతీ అధికారితో పాటు, మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య లోపం లేకుండా చూడాలని ,
ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు . జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లో ముఖ్యమైన శాఖల అధికారులు వారి సిబ్బందికి విధులను ఏర్పాటు చేసి డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లో లెవల్  కాజ్ వే ల వద్ద ప్రజలు దాటకుండా పోలీస్ సిబ్బందితో పాటు, పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  వర్షాల కారణంగా ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కారక్టర్ తెలిపారు . అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  గడచిన రెండు రోజుల్లో  కొన్ని ప్రాంతాల్లో అనుకున్న దానికంటే
ఎక్కువ వర్షం కురిసిందని, గురువారం , శుక్రవారం కొన్ని జిల్లాలలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని, ఇందుకుగాను ఎలాంటి నిధుల కొరతలేదని, ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఎక్కడైనా వర్షాల వల్ల రోడ్లు, విద్యుత్తు వంటి వాటికి అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అవసరమైనచోట ఎస్ డి ఆర్ ఎఫ్ ,ఎన్ డి ఆర్ ఎఫ్ టీములు సిద్ధం చేసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు గురికాకుండా చూడాలని,లో లెవల్ కాజ్ వే ల వద్ద పోలీసు, ఇతర సిబ్బందిని ఆప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రామకృష్ణ రావు మాట్లాడుతూ  భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల వారీగా తీసుకోవలసిన జాగ్రత్తలపై తెలియజేశారు. నల్లగొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,
సంబంధిత జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News