ఎరువుల షాపులు రికార్డులు పరిశీలించిన భద్రాచలం ఏడీఏ అధికారి
By Ram Reddy
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (లోకల్ గైడ్); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్ర పరిధిలో ఉన్న ఎరువుల షాపులను భద్రాచలం ఎంబీఏ అధికారి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భద్రాచలం ఏడీఏ బీ సుధాకర్ రావు, చర్ల వ్యవసాయ అధికారి లావణ్య ఆర్ కొత్తగూడెం, అంజనాపురం, చిన్నమిడిసిలేరు, చర్ల గ్రామాలలోని వివిధ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో కొంతమంది డీలర్ల వద్ద రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. గుర్తించిన దుకాణాలకు స్టాప్ సేల్ నోటీసులు జారీ చేసినట్లు, ఈ విషయం పై చర్ల రైతు వేదిక నందు మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. దుకాణాలలో పెర్మిషన్ బయో ఉత్పత్తుల విక్రయం నిలిపివేయాలని, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టమైన సూచనలు చేసారు.
Tags:
About The Author

Latest News
26 Aug 2025 12:01:37
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా...