📰 "సెప్టెంబర్‌లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం"

*ఎన్నికలకు సిద్ధం* *సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు*

📰

 

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది.

 

అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Tags:

About The Author

Related Posts

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం