ముక్కు కుట్టించుకునే ప్రయత్నంలో సైనస్‌లో ఇరుక్కున్న లోహపు ముక్కు పుడక... ఎక్స్‌రేలో బయటపడిన రహసం!

తల్లికి చెప్పకుండా ముక్కు కుట్టించుకున్న 16 ఏళ్ల బాలిక – ఆరు నెలల తరువాత ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ నిజం!

ముక్కు కుట్టించుకునే ప్రయత్నంలో సైనస్‌లో ఇరుక్కున్న లోహపు ముక్కు పుడక... ఎక్స్‌రేలో బయటపడిన రహసం!

ఒక అమ్మాయికి జరిగిన ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముక్కులో లోపల ఇరుక్కున్న ఒక చిన్న లోహపు ముక్కు పుడక విషయమై ఇటీవలే జరిగిన ఒక ఎక్స్‌రే స్కాన్ ద్వారా విషయం బయటపడింది. ఆ ఎక్స్‌రేను చూసిన తల్లికి మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ, ఆమె కూతురికి మాత్రం వెంటనే ఆ సంఘటన గుర్తుకు వచ్చింది.

దాదాపు ఆరు నెలల క్రితం, ఆ బాలిక తన తల్లిని ముక్కు కుట్టించుకోవాలనే కోరికతో బలంగా పట్టుబడింది. అయితే తల్లి మాత్రం తన కూతురు ఇంకా 16 ఏళ్లు కూడా పూర్తీ చేయలేదు కాబట్టి, ఇలాంటి విషయాలకోసం ఇంకా సమయం ఉందని చెప్పింది. కానీ తల్లిమాటకు అవకాసం ఇవ్వని ఆ బాలిక, తన ఆ కోరికను గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చుకోవాలనుకుంది. అందుకే, ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఏదో ఒక పద్ధతిలో ముక్కు కుట్టించుకునే ప్రయత్నం చేసింది.

ఆ సమయంలో వాడిన లోహపు ముక్కులో ఒక చిన్న భాగం ఆమె ముక్కులోపలికి జారిపోయింది. అది నెమ్మదిగా ఆమె సైనస్ ప్రాంతంలో చిక్కుకుని మిగిలిపోయింది. అయితే, అమ్మకు తెలియబోతుందేమో అనే భయంతో, ఈ విషయం పూర్తిగా దాచిపెట్టింది. అదీ కాక, ఆ ముక్కు పుడక గాలిలో మిగలకుండా బయటకు వచ్చేసి ఉండవచ్చుననో, లేదా తాను మింగేసుండవచ్చుననో అనుకుని పట్టించుకోలేదు.

కానీ తాజాగా ఆమెకు జరిగిన చిన్నతనవైద్య సమస్య కారణంగా తీసిన ఎక్స్‌రేలో ఆ లోహపు ముక్కు పుడక స్పష్టంగా కనిపించింది. దానితో తల్లికి అసలు విషయం తెలిసి ఎంతో ఆశ్చర్యపోయింది. వెంటనే వైద్యులను సంప్రదించగా, డాక్టర్లు పెద్ద ఫోర్సెప్స్ సహాయంతో ఆ ముక్కు పుడకను సురక్షితంగా తొలగించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని చికిత్స పూర్తి చేశారు.

ఈ సంఘటన ఇంటినుంచి బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ, ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి అడుగుతూ సందేహాలు వ్యక్తం చేశారు.

తమ కూతురు గురించి వస్తున్న ప్రశ్నలకు తల్లి స్వయంగా స్పందిస్తూ, “నా కూతురు పూర్తిగా బాగుంది, ఇప్పుడు ఏవిధమైన సమస్య లేదు,” అని తెలియజేసింది.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి